Ycp : ఆ క్లారిటీ వస్తే.. చేరడానికి రెడీ అట
తెలుగుదేశం పార్టీని ఎన్నికల వేళ మరింత బలహీనం చేసే దిశగా వైసీపీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ మాత్రం తన పట్టు సడలకుండా ఉండేందుకు అన్ని [more]
తెలుగుదేశం పార్టీని ఎన్నికల వేళ మరింత బలహీనం చేసే దిశగా వైసీపీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ మాత్రం తన పట్టు సడలకుండా ఉండేందుకు అన్ని [more]
తెలుగుదేశం పార్టీని ఎన్నికల వేళ మరింత బలహీనం చేసే దిశగా వైసీపీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ మాత్రం తన పట్టు సడలకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. విజయనగరం జిల్లాలో మరోసారి క్లీన్ స్వీప్ చేేసే దిశగా వైసీపీ ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
బలహీనంగా ….
బొబ్బిలి బలహీనంగా ఉన్నట్లు వైసీపీ అధినాయకత్వం గుర్తించింది. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీయే గెలిచింది. టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావును వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఓడించారు. ఆయనకు వయస్సు పైబడడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. కరోనా రావడం, వయసు ఎక్కువగా ఉండటంతో దాదాపు రెండేళ్ల నుంచి ప్రజలకు దూరంగానే ఉంటున్నారు.
మార్చాల్సిందే….
ఇక్కడ అభ్యర్థిని వచ్చే ఎన్నికలకు మార్చాల్సిన పరిస్థిితి. అందులో భాగంగా కొత్త నేతను తీసుకురావడమా? బొబ్బిలి రాజులను పార్టీలోకి చేర్చుకోవడమా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. బొబ్బిలి రాజులు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి ఇబ్బంది అంతా బొత్స సత్యనారాయణతోనే. బొత్స కీలకంగా ఉండగా తాము జిల్లాలో రాజకీయాలు చేయలేమని వారు కుండబద్దలు కొడుతున్నారు. అయితే బొత్స సత్యనారాయణను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయి.
బొత్సను తప్పిస్తే….?
బొత్సను మంత్రి పదవి నుంచి రేపు జరగబోయే విస్తరణలో జగన్ తప్పిస్తే సుజయ కృష్ణ రంగారావు ఖచ్చితంగా వైసీపీలో చేరే అవకాశముంది. బొత్స వల్లనే ఆయన గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎటూ వంద శాతం మంత్రివర్గాన్ని మార్పు చేస్తారంటుండటంతో బొబ్బిలి రాజులు వైసీపీలోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు జరగుతున్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.