ఆళ్ల… అంబటి..వీరేనా టార్గెట్?
కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉన్నా [more]
కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉన్నా [more]
కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉన్నా వారి అనుచరులు మాత్రం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతేకాదు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ప్రజలను భయపెట్టే విధంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
క్వారంటైన్ కు ముస్తాఫా….
గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా బావకు కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ముస్తాఫాతో పాటు ఆయన కుటుంబం సభ్యులందరినీ ప్రభుత్వం క్వారంటైన్ కు తరలించింది. ఎమ్మెల్యే ముస్తాఫా స్వచ్ఛందంగా తన కుటుంబ సభ్యులతో కలసి క్వారంటైన్ కు వెళ్లారు. ప్రభుత్వానికి సహకరించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ముస్తాఫా వెంట ఉన్న అనుచరులకు కూడా ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించింది.
ముస్తాఫా విందు ఇచ్చారంటూ….
ఇంతవరకూ బాగానే ఉన్నా కొద్దిరోజుల క్రితం ముస్తాఫా గుంటూరులో ఒక విందు ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారని సోషల్ మీడియాలో కొందరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ విందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తో పాటు కొందరు అధికారులు కూడా హాజరయినట్లు సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.
విందే జరగలేదంటూ…
అయితే అసలు ఎమ్మెల్యే ముస్తాఫా అసలు విందు ఇవ్వనేలేదన్నది అధికారిక సమాచారం. ఈ విషయాన్ని ముస్తాఫాతో పాటు అంబటి రాంబాబు కూడా స్పష్టం చేశారు. అయితే ప్రజలను భయపెట్టేందుకు, వీరిని క్వారంటైన్ వెళ్లేందుకు అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలో చేస్తున్నారు. వీరిని క్వారంటైన్ కు తరలించాంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. కరోనా విపత్తు సమయంలోనూ ఇలాంటి రాజకీయాలేంటని? కక్షలేంటని? వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారులు కోరితే ప్రజల హితం కోరి తాము స్వచ్ఛందంగా క్వారంటైన్ కు వెళతామని వారు చెబుతున్నారు.