ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వీస్తోందా..?

నెల్లూరు రాజ‌కీయాలు రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తుంటాయి. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో నెల్లూరు జిల్లా ప్ర‌భావం కొద్దిగా తగ్గినా కొన్ని సంవ‌త్స‌రాలు వెన‌క్కి వెళ్తే మాత్రం అంతా [more]

Update: 2019-02-07 03:30 GMT

నెల్లూరు రాజ‌కీయాలు రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తుంటాయి. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో నెల్లూరు జిల్లా ప్ర‌భావం కొద్దిగా తగ్గినా కొన్ని సంవ‌త్స‌రాలు వెన‌క్కి వెళ్తే మాత్రం అంతా ఘ‌న‌మే. ఎంతో మంది రాజ‌కీయ దిగ్గ‌జాలు ఈ జిల్లా నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఇదే జిల్లాలోని కొవూరు నియోజ‌క‌వ‌ర్గంకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక్క‌డ నుంచి న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి కుటుంబీకులు అత్య‌ధిక సార్లు ఎన్నిక‌య్యారు. ప్ర‌స‌న్నాకుమార్‌రెడ్డి, ఆయన తండ్రి శ్రీనివాసులురెడ్డి క‌ల‌సి ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది సార్లు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచి విజ‌యం సాధించిన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో వైసీపీకి మారారు. ఆ మయంలో తన పదవికి కూడా రాజీనామా చేశారు.

ప్రజల్లో ఉంటున్న ప్రసన్న…

2012లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీచేసి… టీడీపీ అభ్య‌ర్థి, స్వ‌యానా త‌న బావ అయిన చంద్ర‌మోహ‌న్‌రెడ్డిపై గెలిచారు. అయితే అనుహ్యంగా 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేతిలో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూశారు. ఈ ఎన్నిక‌ల్లో జిల్లా అంత‌టా వైసీపీ గాలి వీచినా కోవూరులో మాత్రం ప్ర‌స‌న్న‌కుమార్ ఓడిపోయారు. ఐదేళ్లుగా అధికారానికి దూర‌మైన న‌ల్ల‌పు ప్ర‌స‌న్నకుమార్‌రెడ్డి నిత్యం ప్ర‌జాక్షేత్రంలో ఉంటున్నారు. కొవూరు వైసీపీ సీటు ఆయ‌న‌కు ఖాయంగా క‌నిపిస్తోంది. అధికారికంగా పార్టీ ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు త‌ప్పా వేరొక‌రికి టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. సొంత పార్టీ నేత‌లే శ్రీనివాసులు రెడ్డికి టికెట్ కేటాయిస్తే పార్టీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని రాష్ట్ర అధినాయ‌క‌త్వానికి కూడా ఫిర్యాదు చేసినట్లు స‌మాచారం.

ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత

అస‌లే గ‌త ఎన్నిక‌ల్లో అత్తెస‌రు మెజార్టీతో గెలిచిన ఆయ‌న‌కు ఈసారి సీటు ఇస్తే ఇక్క‌డ టీడీపీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని అక్క‌డ వాతావ‌ర‌ణం చెప్పేస్తోంది. వాస్త‌వానికి పొలంరెడ్డి గ‌త ఎన్నిక‌ల్లోనూ అనుహ్యంగా తెర‌పైకి వ‌చ్చి టీడీపీ నుంచి టికెట్ ద‌క్కించుకుని గెల‌వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ నుంచి ఆయ‌న ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు టీడీపీ గూటికి చేరారు. 2004లో కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌టంతో చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌కే టికెట్ కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే శ్రీనివాసులురెడ్డి ఎన్నిక‌ల్లో అయితే గెలిచారు గాని ప్ర‌జాభిమానాన్ని చూర‌గొన‌లేక‌పోయార‌నే అభిప్రాయం వెలువ‌డుతోంది. అందుకే ఈసారి ఆయ‌న‌కు టికెట్టివ్వ‌ద్దంటూ సొంత పార్టీ నేత‌లే పోరు బెడుతున్నార‌ట‌. ఈసారి ఆయ‌న‌కు కాకుంటే టీడీపీ నుంచి పెళ్ల‌కూరు శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ జిల్లా ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి చేజెర్ల వెంక‌టేశ్వ‌ర్లు పేర్లు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు మండ‌లాల్లో క‌మ్యూనిస్టుల ప్రభావం ఇప్ప‌ట‌కీ కొంత ఉన్నా జ‌న‌సేన‌కు ఇక్క‌డ ప‌ట్టే లేదు. ఏదేమైనా ఈసారి కొవూరులో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య‌ పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News