ఫ్యాక్ట్ చెక్: నుపుర్ శర్మకు మద్దతుగా అఘోరాలు రోడ్లపైకి వచ్చారా..?

Video Shows Naga Sadhus Coming Out in Support of Nupur Sharma

Update: 2022-06-18 05:04 GMT

క్లెయిమ్: నుపుర్ శర్మకు మద్దతుగా నాగా సాధువులు రోడ్లపైకి వచ్చారా..?

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

సస్పెండ్ చేయబడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే..! ఈ వివాదం మధ్య, నాగ సాధువులు పెద్ద సంఖ్యలో వీధుల్లో ర్యాలీ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీరంతా నుపుర్ శర్మకు తమ మద్దతును తెలియజేస్తూ ఉన్నారని చెబుతున్నారు.

ఓ టీవీ డిబేట్‌లో జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడుతున్న కమ్రంలో ముహమ్మద్‌ ప్రవక్త పై నుపుర్ శర్మ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్‌ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి వివరణ, క్షమాపణలు కోరాయి. నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పారు నుపుర్ శర్మ. పదే పదే మహాదేవుడ్ని(శివుడ్ని) అవమానించడం, అగౌరవపర్చడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

ఆమెకు, ఆమె కుటుంబానికి ఎంతో మంది నుండి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని కూడా వ్యాఖ్యలు చేశారు కొందరు. ఇలాంటి సమయంలో నాగా సాధువులు ఆమెకు మద్దతు తెలిపారంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

హిందీలో 'నాగా సాధుస్ ర్యాలీ' అనే పదాన్ని ఉపయోగించి గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు, 7 ఏప్రిల్ 2021న 'పర్యతన్‌సతి' అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియో మాకు కనిపించింది.

Full View

వైరల్ పోస్టులో విజువల్స్ 0:32-సెకన్ల వద్ద మీరు చూడవచ్చు.

2021లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని కుంభమేళాలో నాగ సాధువులు షాహి స్నానానికి వెళుతున్నప్పుడు చిత్రీకరించినట్లు వీడియో టైటిల్ సూచించింది. 2021 కి సంబంధించిన వైరల్ క్లిప్, YouTube వీడియో మధ్య సారూప్యతలను గమనించవచ్చు.
మేము Facebookలో మరొక వీడియోను కనుగొన్నాము. అదే ప్రదేశం నుండి వచ్చిందని.. అదే ఊరేగింపుకు సంబంధించినదని చూపెడుతూ ఉంది.

మేము లొకేషన్‌ను నిర్ధారించడానికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 'రణధీర్ బుక్ షాప్' కోసం వెతికాము. Google మ్యాప్స్‌లో అదే దుకాణం బోర్డు కనిపించింది.

వార్తా సంస్థ రాయిటర్స్ ద్వారా 2021 కుంభమేళా ఫోటోలని కూడా మేము కనుగొన్నాము. హరిద్వార్‌లోని కుంభమేళాలో స్నానాలు చేసేందుకు గంగా నది వైపు వెళుతున్న నాగ సాధువుల చిత్రాలను రాయిటర్స్ చూపించింది.

నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా సాధువులు వచ్చారంటూ ఎలాంటి నివేదికలు మేము కనుగొనబడలేదు. స్పష్టంగా, 2021 కుంభమేళాకు సంబంధించిన నాగ సాధువుల పాత వీడియోను నుపుర్ శర్మకు మద్దతునిస్తున్నారని తప్పుగా ప్రచారం చేశారు.


క్లెయిమ్: నుపుర్ శర్మకు మద్దతుగా నాగా సాధువులు రోడ్లపైకి వచ్చారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Video Shows Naga Sadhus Coming Out in Support of Nupur Sharma
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News