తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అందమైన ప్రకృతికి ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, మంత్రముగ్దులను చేసే జలపాతాలు ఉన్నాయి. అందమైన ప్రకృతి, పచ్చదనంతో ఉన్న ప్రదేశాలు. ఎన్నో అద్భుతమైన జీవరాశులకు అనువైన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు గొప్ప డెస్టినేషన్. ఇక్కడి ప్రాంతాలు ట్రెక్కింగ్‌కు కూడా అనువైనవి.
ఓవైపు అరణ్యం, మరోవైపు జలసవ్వడులు.. ఇలాంటి దృశ్యాలను ఒక్కమాటలో వర్ణించలేం. ఉత్తర సహ్యద్రి కొండల మధ్యలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్.. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. వాగులు, వంకలు, డట్టమైనా అడవులు, కావ్వాల్ అభయ్యారణ్యం, బాసర దేవాలయం, సింగరేణి బొగ్గు గనులు ఇలా ఎన్నో ప్రత్యేకలకు ఆదిలాబాద్ జిల్లా కేరాఫ్ గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పలు జలపాతాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం కూడా ఇటీవల బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. కుంతల జలపాతాలు, కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం, బాసర సరస్వతి దేవాలయం వంటి అందమైన ప్రదేశాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి.
అందమైన ప్రకృతి, చెట్ల మధ్య ఓ రహదారిని చూపించే చిత్రం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉందని ప్రచారం చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో లేదు, ఆస్ట్రేలియాలో ఉంది.
మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వైరల్ ఇమేజ్‌ని సెర్చ్ చేసినప్పుడు, 2019లో ఫేస్‌బుక్‌లో రోడ్ ఆన్ కాంగ్రో ఐలాండ్, ఆస్ట్రేలియా అనే క్యాప్షన్‌తో ప్రచురించిన పోస్ట్‌ని మేము కనుగొన్నాము.
“Kangaroo Island in Australia” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, “Long tortuous road in Kangaroo Island.” అనే పేరుతో జూలై 04, 2012న
Istock ఇమేజ్‌లో ప్రచురించిన అదే చిత్రాన్ని మేము కనుగొన్నాము
ఇదే చిత్రాన్ని జూన్ 1, 2012న ఇసాబెల్లె అనే ఫోటోగ్రాఫర్
Flickrలో షేర్ చేశారు.
ఆమె బయో ను వెతకగా ఆమె సిడ్నీ ఆస్ట్రేలియా కు చెందిన గ్రాఫిక్ దిసైనర్ అనీ, ఆమెకు ఫోటో గఫీ అంటే చాలా ఇష్టమనీ తెలుస్తోంది. ఆమె తీసిన ఎన్నో చిత్రాలని మనం ఇక్కడ చూడొచ్చు. వాటిలో ఒకటి వైరల్ చిత్రాన్ని పోలి ఉండడం కూడా మనం చూడొచ్చు. స్టాక్ ఫోటో వెబ్‌సైట్
గెట్టి ఇమేజెస్‌లో కూడా ఇలాంటి చిత్రాలు అప్లోడ్ చేశారు
దక్షిణ ఆస్ట్రేలియా తీరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంగారూ ద్వీపం, కోలాస్, కంగారూలు, సీ లయన్స్, సీల్స్ వంటి జంతువులను చూడటానికి
ఆస్ట్రేలియాలోని ఉత్తమ ప్రదేశాలలో ఒకటి. కంగారూ ద్వీపం మీకు ఎన్నో అనుభూతులను అందిస్తుంది.
టూరిస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, కంగారూ ద్వీపం ఆస్ట్రేలియాలో మూడవ అతిపెద్ద దీవి, ప్రపంచంలోని అత్యుత్తమ ద్వీపాలలో ఒకటి. కంగారూ ద్వీపం చుట్టూ డ్రైవింగ్ చేయడం ఎంతో ప్రతేకమైన అనుభూతిని ఇస్తుంది. ద్వీపంలోని మరిన్ని పట్టణాలు, ప్రాంతాలను చూడటానికి ఎంతో గొప్ప ప్రదేశం. మూడు నుండి నాలుగు గంటలలోపు కంగారూ ద్వీపం చుట్టూ డ్రైవ్ చేయవచ్చు. కొన్ని రోజుల పాటూ ఇక్కడే గడపాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు.
ఇదే వెబ్సైట్ లో ఈ రోడ్డు ని కేప్ డు కౌడిక్ రోడ్ అంటారని తెలుస్తోంది. ప్రపంచం లో అద్భుతమైన చిత్రాలని ప్రచురించే వెబ్సైట్ ఒకటి, కేప్ డు కౌడిక్ రోడ్ గురించి వివరిస్తూ, ఇది ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలోని ఫ్లిండర్స్ చేజ్ నేషనల్ పార్క్‌లో ఉన్న సుందరమైన రోడ్ అంటూ వివరించింది. ఈ రహదారి పైన వెల్తుంటే శిఖరాలు, గుహలు, అలాగే చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన మలుపులను చూడొచ్చు. సుందరమైన డ్రైవ్‌తో పాటు వాట్సన్ హిల్ లుకౌట్, ఈగిల్ క్లిఫ్స్ వంటి అనేక సందర్శనా ప్రదేశాలు ఉన్నాయి. చుట్టూతా ఉన్న సముద్రం, ఈ దృశ్యాలని ఇంకా అద్భుతంగా చేస్తుంది.
చాలా మంది వ్లాగర్లు, యూట్యూబర్‌లు కంగారూ ద్వీపానికి వెళ్లే రహదారిని చిత్రీకరించారు. ఇవి వైరల్ ఇమేజ్‌ని పోలి ఉన్నాయి. మే 2, 2023న లారా వాడెల్ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన వీడియో ఇక్కడ ఉంది, ఇది వైరల్ ఇమేజ్‌లో కనిపించే రహదారిని చూపుతుంది.
అందువల్ల, వైరల్ చిత్రం ఆదిలాబాద్ జిల్లాలోనిది కాదు, ఇది ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలో ఉంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.