చీటింగ్.. పది లక్షలు క్షణాల్లో మాయం

హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన ఒక వ్యాపారి పది లక్షల రూపాయలు మోస పోయారు.

Update: 2022-02-08 04:35 GMT

మోసం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎంత అప్రమత్తంగా ఉన్న మాయమాటలు చెప్పి మోసం చేసేవారు అధికమవుతున్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీంతో పాటు వ్యాపారులను నమ్మించి మోసం చేసే వారి సంఖ్య కూడా అధికంగా కనపడుతుంది. తాజాగా హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన ఒక వ్యాపారి పది లక్షల రూపాయలు మోస పోయారు.

ఫోన్ స్విచాఫ్ రావడంతో....
పాతబస్తీలో స్పోర్స్ పరికరాల వ్యాపారం చేసే ఒక వ్యాపారి నుంచి మోసగాళ్లు పది లక్షలు కాజేశారు. తక్కువ ధరకు క్రీడా సామాగ్రి ఇప్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పారు. తక్కువ ధరకు సరుకు వస్తుందని భావించి ఆ వ్యాపారి వారు అడిగిన పది లక్షల నగదును బదిలీ చేశారు. తర్వాత వారి ఫోన్ స్విచాఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News