ఈ రైళ్లు సికింద్రబాద్ స్టేషన్ కు రావు
కొన్ని రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ కు రావని, కాచిగూడ స్టేషన్ తో పాటు నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళతాయని తెలిపింది.;

కొన్ని రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ కు రావని, కాచిగూడ స్టేషన్ తో పాటు నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళతాయని తెలిపింది. ప్రయాణికులు దీనిని గమనించాలని కోరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను ఇతర స్టేషన్లకు మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ-సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడలో బయల్దేరి కాచిగూడ స్టేషన్‌కు వెళుతుంది.
పోరుబందర్-సికింద్రాబాద్ (20968/20967) పోరుబందర్ ఎక్స్‌ప్రెస్ పోరుబందర్ నుంచి కాచిగూడ మీదుగా ఉందానగర్ వరకు వెళుతుంది.
సిద్దిపేట-సికింద్రాబాద్ (77656/77653), (77654/77655) డెము రైళ్లు మల్కాజిగిరి వరకు వెళతాయి.
పుణే-సికింద్రాబాద్ (12025/12026) పుణే ఎక్స్‌ప్రెస్ ప్రారంభ, గమ్యస్థానం హైదరాబాద్‌కు మార్చారు.
సికింద్రాబాద్-మణుగూరు (12745/12746) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది.
సికింద్రాబాద్-రేపల్లె (17645/17646) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సిల్చార్-సికింద్రాబాద్ (12514/12513) సిల్చార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-దర్బంగ (17007/17008) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లు చర్లపల్లి నుంచి బయల్దేరుతాయి.