నేడు హెచ్.సి.యూకి సుప్రీం కమిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు పరిశీలించేందుకు సుప్రీం కోర్టు నియమించిన కమిటీ హైదరాబాద్ కు చేరుకుంది;

Update: 2025-04-10 03:54 GMT
supreme court, committee, inspect the lands, hyderabad central university
  • whatsapp icon

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు పరిశీలించేందుకు సుప్రీం కోర్టు నియమించిన కమిటీ హైదరాబాద్ కు చేరుకుంది. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే. దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది

వాస్తవ పరిస్థితులు...
వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు నిన్న సాయంత్రం 7:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యులు ఈరోజు ఉదయం 10 గంటలకు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చేరుకోనున్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనం, మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కమిటీ కానుంది.


Tags:    

Similar News