Gold Price Today : ఎన్నాళ్లకెన్నాళ్లకు తీపికబురు.. ఇంత ధర బంగారం తగ్గుతుందని ఊహించలేదుగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ పతనం కనిపించింది.;

ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత అన్నింటికీ వర్తిస్తుంది. అయితే వ్యాపారంలో మాత్రం డిమాండ్ ను బట్టి ధరను నిర్ణయిస్తారు. బంగారం విషయంలో మాత్రం రెండోదే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడూ బంగారం ధర పెరుగుదలను మాత్రమే చూస్తుంటాం కాని, తగ్గుదలను చాలా అరుదుగా వింటాం. ఇక ధరలు పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ఉండటం గోల్డ్ ప్రత్యేకత. బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి మొదలయిన పరుగు దాదాపు ఆగలేదు. ఒక దశలో తులం బంగారం లక్ష రూపాయలకు ఈ ఏడాది చేరుకుంటుందన్న అంచనాలు కూడా వినిపించాయి.
ధరలు పెరుగుతుండటంతో...
కానీ ఒక్కసారిగా ధరలు పెరగడంతో పాటు కొనుగోళ్లు చాలా వరకూ పడిపోయాయి. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలు జ్యుయలరీ దుకాణాల వైపు కూడా చూసేందుకు జంకుతున్నారు. ధరలు అంత స్థాయిలో పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ అయినా సరే దాదాపు 70 శాతం అమ్మకాలు పడిపోయాయి. ధనికులు కొనుగోలు చేసేది ఎప్పుడూ పది శాతమే. మిగిలిన 90 శాతం బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేది మధ్యతరగతి ప్రజలు మాత్రమే. ఏ వ్యాపారంలోనైనా అంతే. ఈ దిగువ తరగతికి ఏ వస్తువు ధర అయినా అందుబాటులో ఉంటేనే కొనుగోలు చేస్తారు. లేకుంటే అటువైపు చూడరు. అందుకే మధ్యతరగతి ప్రజలు తమ దేవుళ్లుగా వ్యాపారులు చెప్పుకుంటారు.
ప్రత్యామ్నాయం వైపు...
బంగారం అనేది స్టేటస్ సింబల్ అయినప్పటికీ అత్యంత ఖరీదైన వస్తువుగా మారడంతో దానికి ప్రత్యామ్నాయం వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రస్తుతం బంగారంపై మదుపు చేసే కంటే భూమి మీద పెట్టుబడి పెట్టడం మంచిదన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తమవుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ పతనం కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 2,400 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వేలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 85,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,000 రూపాయులగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,02,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.