Hyderabad : పుస్తకప్రియులకు పసందైన వార్త ...నేటి నుంచి హైదరాబాద్ లో బుక్ ఫెయిర్
హైదరాబాద్ లో నేటి నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్ లో నేటి నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ బుక్ ఫెయిర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ బుక్ ఫెయిర్ లో 350 స్టాళ్లను ఏర్పాటు చేశారు. పుస్తకప్రియులకు మంచి పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, దాదాపు 210కి పైగా ఉన్న ప్రచురణ కర్తలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఫుడ్ స్టాళ్లు కూడా...
సాహిత్య ప్రియులతోపాటు పిల్లలకు, పెద్దలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అయితే పుస్తక ప్రదర్శనలో తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశామని, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కవులను కూడా సత్కరించే కార్యక్రమాలను చేపట్టనున్నామని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ షేక్ తెలిపారు. ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకూ బుక్ ఫెయిర్ సాగనుంది
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now