గాంధీభవన్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతల ఘర్షణ
గాంధీ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం రాసాభాసగా మారింది.
గాంధీ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం రాసాభాసగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తన తనయుడికి రాజ్యసభ పదవి ఇచ్చినంత మాత్రాన తనకు మరో పదవి ఇవ్వకూడదా? అని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని...
తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. దీంతో గొడవ పెద్దదయింది. ఈ పరిస్థితుల్లో ఈ సమావేశానికి హాజరయిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత గాంధీ భవన్ ఆవరణలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అయితే నేతలు వారికి సర్దిచెప్పి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది.