Manchu Mohan Babu : మోహన్ బాబును అందుకే అరెస్ట్ చేయలేదు..స్పందించిన కమిషనర్
సినీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదాలపై రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు.
సినీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదాలపై రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు. ఇప్పటికే మోహన్ బాబు కుటుంబ సభ్యులపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని తెలిపారు. మోహన్ బాబు తనకు ఈ నెల 24వ తేదీ వరకూ సమయం కోరారని ఆయన తెలిపారు. కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేయలేదని తెలిపారు.
పర్మిషన్ తీసుకోవాల్సిందే...
మళ్లీ టైం కావాలంటే మరోసారి పర్మిషన్ తీసుకోవాలని, లేదంటే వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. మూడు ఎఫ్ఐఆర్ లపై దర్యాప్తు చేస్తున్నామని, లీగల్ గా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మోహన్ బాబును అరెస్ట్ చేయలేదన్న ఆయన మోహన్ వద్ద తుపాకీల గన్ లైసెన్సు రాచకొండపోలీసులు ఇచ్చింది కాదని తెలిపారు. మెహన్ బాబుకుఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నవిషయాన్ని గుర్తు చేశారు.