Free Medical Tests For Women: అక్కడ ఫ్రీగా మహిళలకు మెడికల్ టెస్టులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కింగ్ కోఠిలోని కామినేని హాస్పిటల్​లో;

Update: 2024-03-08 08:24 GMT
Free Medical Tests For Women: అక్కడ ఫ్రీగా మహిళలకు మెడికల్ టెస్టులు
  • whatsapp icon

Free Medical Tests For Women:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కింగ్ కోఠిలోని కామినేని హాస్పిటల్​లో మహిళలకు ఫ్రీగా మెడికల్​ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు ఉచితంగా టెస్టులు నిర్వహించనున్నామని హాస్పిటల్​చైర్మన్ కామినేని సూర్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 నుంచి 15 వరకు అన్ని రకాల టెస్టులు, స్కానింగ్​లు ఫ్రీగా చేస్తున్నట్లు తెలిపారు. కంప్లీట్ బ్లెడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, గైనకాలజీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ స్కానింగ్ లు చేయనున్నారు. అపాయింట్మెంట్ కోసం 78159 78159 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

30, 40, 50 ఏళ్లు దాటిన మహిళలకు కొన్ని మెడికల్ టెస్టులు చేయించాల్సిన ఆవశ్యకత ఉందని ఇప్పటికే పలువురు నిపుణులు తెలిపారు. వాటి గురించి కచ్చితంగా కుటుంబ సభ్యులకు అవగాహన ఉండాలని.. లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉంటారు. అందుకే ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులను చేయించుకోవడం చాలా మంచిది.


Tags:    

Similar News