Gold Rates Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీ గా తగ్గాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి;

Update: 2025-04-04 05:58 GMT
gold rates today in prices, silver, prices, india
  • whatsapp icon

బంగారం ధరలు భారీ గా తగ్గాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి. కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడానికి మంచి సమయం. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు మధ్యాహ్నానికి భారీగా తగ్గడంతో వ్యాపారులు కూడా అమ్మకాలు ఊపందుకుంటాయన్న ఆనందంలో ఉన్నారు. వినియోగదారులు కూడా ఇక బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశముంది.

తగ్గిన ధరలు ఇలా...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధరపై 1,600 రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయల వరకూ తగ్గుముఖం పట్టింది. దీంతో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 84,000 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,640 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News