Hyderabad : రేపు కూడా పాఠశాలలకు సెలవు
హైదరాబాద్ లో రేపు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం పాఠశాలలు బంద్ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది;

school holidays in AP today
హైదరాబాద్ లో రేపు కూడా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం పాఠశాలలు బంద్ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. మ్యాన్ హోళ్ల వద్ద ప్రమాదరకమైన పరిస్థితులు నెలకొన్నాయి.
అందుకే బంద్ చేయాలి...
దీంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావం రెండు రోజుల పాటు ఉంటుందని, హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలియడంతో ప్రభుత్వం సోమవారం కూడా సెలవు దినంగా ప్రకటించింది. గత మూడు రోజుల నుంచి కుండపోత వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.