హైదరాబాద్ ఎయిర్ పోర్టు లోకి అడుగుపెడుతున్నారా.. ఈ విషయం మీకే..!

Update: 2022-12-24 02:17 GMT

చైనాలోనూ.. ఇతర దేశాలలోనూ.. కోవిడ్-19 కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతుండడంతో హైదరాబాద్ నగరం కూడా అప్రమత్తంగా ఉంది. శుక్రవారం నుండి విదేశీ ప్రయాణీకుల విషయంలో కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు శనివారం నుండి అమలులోకి వస్తాయి, అంతర్జాతీయ ప్రయాణీకులందరూ పూర్తిగా టీకాలు వేసుకున్నారని నిర్ధారించుకోవాలి. అనుమానితులను RT-PCR పరీక్ష చేయించుకోవాలి. కోవిడ్ పాజిటివ్ ప్రయాణికులకు ఐసోలేషన్ ప్రోటోకాల్ గురించి తెలియజేస్తామని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

కొత్త వేరియెంట్పై దేశంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ విధానంతో ముందుకు వెళ్లాలని రాష్ట్రాలకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్లు, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం తప్పనిసరి అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. న్యూఇయర్ వేడుకలు, పండుగల సీజన్ కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. చైనాలో ఇప్పటికే ప్రతిరోజూ ఒక మిలియన్ కొత్త ఇన్ఫెక్షన్లు.. 5,000 మరణాలు నమోదవుతూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ మొదలైంది.


Tags:    

Similar News