BJP : నేడు బీజేపీ కీలక సమావేశం.. మేయర్ పై అవిశ్వాసం
భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది.;

భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బీజేపీ కార్పొరేటర్లతో పార్టీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెడితే ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
అవిశ్వాసంపై తీర్మానంలో...
బీఆర్ఎస్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతుంది. బీజేపీకి ఎక్కువ మంది సభ్యుల బలం ఉండటంతో వారి నిర్ణయం కీలకంగా మారనుంది. అందుకే జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై నేడు చర్చించనున్నారు. అవిశ్వాసంపై తమ స్టాండ్ ఎలా ఉండాలన్న దానిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు.