Breaking: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బెయిల్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించింది;

Update: 2025-01-03 11:46 GMT

నాంపల్లి కోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఊరట లభించింది. .ఆయనకు  బెయిల్ ఇచ్చింది. సంథ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగియడంతో నేడు తీర్పు ఇచ్చింది. దాంతో. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠ వీడిపోయింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతోఆమె మృతికి అల్లు అర్జునే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మధ్యంతర బెయిల్ పై...
దీనిపై నాంపల్లి కోర్టు గతంలో రిమాండ్ విధించింది.అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయడంతో అల్లు అర్జున్ గంటల వ్యవధిలోనే బయటకు వచ్చారు. తనకు బెయిల్ ఇప్పించాలంటూ నాంపల్లికోర్టులో పిటీసన్ వేశారు. దీనికి సంబంధించిన వాదోపవాదాలు పూర్తికావడంతో తీర్పు రిజర్వుచేసింది. దీనిపై కొద్దిసేపటి క్రితం నాంపల్లికోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో భారీ ఊరట లభించినట్లయింది. యాభై వేల రూపాయల విలువైన పూచీకత్తు సమర్పించాలని కోరింది. 

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News