నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇక్కడ
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.;

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 11.40 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మీరాలం ట్యాంక్ ఈద్గా, మసాబ్ బ్యాంక్ వద్ద ఉన్న హకీంపేట వద్ద ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాల్లో...
మసాబ్ ట్యాంక్ లోని హాకీ గ్రౌండ్, బహదూర్ పుర, కాలాపత్తర్, నవాబ్ సాహెబ్ కుంట, శాస్త్రిపురం, ఎస్ఎండీసీ, ఖాజా మ్యాన్షన్స్, బంజారాహిల్స్ జంక్షన్, పీటీఐ జంక్షన్ ల వద్ద ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ సమయంలో వెళ్లాలని సూచించారు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులకు కూడా సహకరించాలని కోరారు.