10వ తరగతి విద్యార్థితో టీచర్ ప్రేమాయణం.. కట్ చేస్తే
అదే పాఠశాలలో గచ్చిబౌలికి చెందిన బాలుడు (15) 10వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ ఫిబ్రవరి 16న ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు.;

teacher affair with student
10వ తరగతి బాలుడికి పాఠాలు చెప్పే టీచర్ .. అతడితోనే అదృశ్యమైంది. రెండ్రోజుల పాటు ఇళ్ల నుండి వెళ్లిపోయిన వీరిద్దరి గురించి.. వాళ్లు తిరిగి ఇళ్లకు చేరుకున్నాక తెలిసింది. హైదరాబాద్ శివారులోని చందానగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు పాఠశాలలో యువతి (26) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో గచ్చిబౌలికి చెందిన బాలుడు (15) 10వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ ఫిబ్రవరి 16న ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు. తన మనవరాలు కనిపించడం లేదని ఆమె తాతయ్య చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అదే సమయంలో తమ కుమారుడు కనిపించడం లేదంటూ బాలుడి తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకే ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. దాంతో మిస్సింగ్ కంప్లైంట్ విత్ డ్రా చేసుకున్నాడు ఆమె తాతయ్య. బాలుడు కూడా ఇంటికి రాగా.. పోలీసులు అతడిని విచారించారు. ఈ రెండ్రోజులు ఎక్కడికి వెళ్లావు అని పోలీసులు నిలదీయడంతో టీచర్ తో ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది. ఫిబ్రవరి 16న టీచర్ తో కలిసి బయటికెళ్లినట్లు తెలపడంతో.. పోలీసులు ఆమెను కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా.. టీచర్ కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతోనే ఆమె విద్యార్థితో కలిసి ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.