Telangana : తెలంగాణ పోలీసు సంచలన నిర్ణయం ... ట్రాన్స్ జెండర్ల నియామకం
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ట్రాఫిక్ విధుల్లో 44 మంది ట్రాన్స్ జెండర్లను నియమించింది. తొలి నియామకాలు హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతుంది. గోషామహల్ స్టేడియంలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహించారు.
టెస్ట్ లను నిర్వహించి...
రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్ లను నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారు. ఈ పోటీల్లో ప్రతిభను కనపర్చిన వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని ట్రాఫిక్ విధుల్లో భాగస్వామ్యులను చేయనున్నారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగర పరిధిలోనే దీనిని ప్రవేశపెట్టి తర్వాత తెలంగాణ అంతటా విస్తరించాలన్న యోచనలో పోలీసు శాఖ ఉంది.