రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గురువారం నాడు బక్రీద్ సందర్భంగా జూన్ 29న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

Update: 2023-06-28 02:17 GMT

గురువారం నాడు బక్రీద్ సందర్భంగా జూన్ 29న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు జరగనున్న మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌కు సంబంధించిన నోటిఫికేషన్​ను సిటీ సీపీ ఆనంద్ విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం ఈద్గాకు వచ్చే వారి వెహికల్స్​కు మాత్రమే అనుమతి ఇస్తామని వెల్లడించారు. పురానాపూల్, కామాటిపురా, కిషన్​బాగ్ నుంచి ఈద్గా వైపు వచ్చే వెహికల్స్​ను జూ పార్కు, మసీదు అల్లా ఏరియాలోని ఓపెన్‌‌‌‌ స్పేస్‌‌‌‌లో పార్కింగ్ చేయాలని సూచించారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్‌‌‌‌ నుంచి ఈద్గాకు వచ్చే వెహికల్స్ శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట రూట్​లో వెళ్లాల్సి ఉంటుందన్నారు. పురానాపూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు జియాగూడ, సిటీ కాలేజీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

పురాణాపూల్ నుంచి బహదూర్‌పుర వైపు వచ్చే ఆర్టిసి బస్సులు, భారీ వాహనాలను పురాణాపూల్ దర్వాజ నుంచి జియాగూడ, సిటీ కాలేజీవైపు మళ్లిస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా బహదూర్‌పుర వైపు వేల్లే వాహనాలను ఆరాంఘర్ వైపు మళ్లిస్తారు. లకడీకాపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను రోడ్డు నంబర్ 1,12 మీదుగా మాసబ్ ట్యాంక్ నుంచి అయోధ్య జంక్షన్ మీదుగా నిరంకారీ, ఖైరతాబాద్, వివి స్టాట్యూ, ఖైతరాబాద్ ఆర్టిఏ ఆఫీస్, తాజ్‌కృష్ణ హోటల్‌వైపు మళ్లిస్తారు.
నగరంలో సీఎం కేసీఆర్ కాన్వాయ్:
రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు 600 కార్ల కాన్వాయ్‌తో వెళ్ళిన సీఎం కేసీఆర్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు అదే కాన్వాయ్‌తో వచ్చారు. పటాన్‌చెరు మీదుగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోకి సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ ప్రవేశించగా పంజాగుట్ట మీదుగా ప్రగతిభవన్‌ వరకు పోలీసులు అడుగడుగునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పటాన్‌చెరు, మియాపూర్‌, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ట్రావెల్‌ బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. సీఎం కాన్వాయ్‌ రావడం కంటే అరగంట ముందు నుంచే ఆంక్షలు విధించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Tags:    

Similar News