దసరా దోపిడీకి దిగిన ప్రయివేటు బస్సుల యాజమాన్యం

దసరాకు సొంత ఊళ్లకు వెళ్లాలంటే దోపిడీకి ప్రయాణికులు గురవుతున్నారు. ప్రయివేటు బస్సులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేశాయి;

Update: 2024-10-11 04:33 GMT
dussehra 2024, private buses charges, private busses during dussehra festival, bus bookings in dussehra festival

 private busses

  • whatsapp icon

దసరాకు సొంత ఊళ్లకు వెళ్లాలంటే దోపిడీకి ప్రయాణికులు గురవుతున్నారు. ప్రయివేటు బస్సులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేశాయి. నిన్నటి నుంచి మళ్లీ దసరా రద్దీ మొదలయింది. ఈరోజు నుంచి కూడా అనేక మంది దసరా పండగ కోసం సొంతూరుకు వెళుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో ముందుగానే రిజర్వేషన్లు అయిపోవడంతో ప్రయివేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది.

అత్యధిక ఛార్జీలు...
దీంతో ప్రయివేటు బస్సుల యాజమాన్యం దోపిడీకి దిగింది. అత్యధికంగా ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నారు. రాజమండ్రికి మూడు వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. విజయవాడకు రెండు వేల చెల్లించాల్సిందే. టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ని బస్సులు వేసినా రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయివేటు బస్సులను ఆశ్రయించక తప్పడం లేదంటున్నారు ప్రయాణికులు. ప్రభుత్వం, ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.


Tags:    

Similar News