Hyderabad : హైదరాబాదీలకు గుడ్ న్యూస్...వరద నీటికి చెక్

వర్షం పడిందంటే హైదరాబాద్ నగరంలో రోడ్ల మీదకు నీళ్లు చేరతాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంభించిపోతుంది;

Update: 2024-12-03 03:56 GMT

వర్షం పడిందంటే హైదరాబాద్ నగరంలో రోడ్ల మీదకు నీళ్లు చేరతాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంభించిపోతుంది. గంటల తరబడి వాహనాలు వర్షంలో చిక్కుకుని పోతాయి. అంతేకాదు లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు ప్రవేశించి ఇళ్లలోకి మురుగునీరు చేరడం ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నేడు వరద నీటి సంపుల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

వరదనీటి సంపుల నిర్మాణం...
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం చేపట్టనున్నారు. ఇవాళ సచివాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వరద నీరు, ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు సంపుల నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా మొత్తం పన్నెండు ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లించనున్నారు.దీంతో వరద నీటికి చెక్ పెట్టవచ్చని అధికారులు అంచనా వేశారు.


Tags:    

Similar News