Lebanon : మళ్లీ పేలుళ్లు : 14 మంది మృతి, 450 మందికి గాయాలు

లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు జరిగాయి. అయితే ఈసారి పేజర్లు కాదు. వాకీటాకీలు. ఈ పేలుళ్లతో పధ్నాలుగు మంది మరణిచారు

Update: 2024-09-19 02:06 GMT

లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు జరిగాయి. అయితే ఈసారి పేజర్లు కాదు. వాకీటాకీలు. ఈ పేలుళ్లతో పధ్నాలుగు మంది మరణిచగా, 450 మంది వరకూ గాయపడ్డారు. అయితే ఈ దాడులకు ఇజ్రాయిల్ కారనమని తాము అనుకుంటున్నట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. నిన్న పేజర్లు పేలుడు జరిగి ముగ్గురు హెజ్‌బుల్లా సభ్యులతో పాటు ఒక బాలుడు మరణించిన ఘటన మరవక ముందే మళ్లీ వాకీ టాకీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీరుట్ లో వారి అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంగా తిరిగి వాకీటాకీలను పేర్చారు.

లెబనాన్ సరిహద్దుల్లో...
హెజ్‌బొల్లా గ్రూపు చేతిలో ఉండే వాకీటాకీలు పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటికే లెబనాన్ సరిహద్దుల్లోకి ఇజ్రాయిల్ సైన్యం చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు గాజాతో పాటుగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ ను ఇజ్రాయిల్ ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆహోదించింది. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో శాంతి ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడుతుంది.


Tags:    

Similar News