Sunita Williams : సునీత వచ్చేశారు... తొమ్మిది నెలల నిరీక్షణకు తెర

అంతరిక్షంలో తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ భూమి మీదకు చేరుకున్నారు.;

Update: 2025-03-19 01:44 GMT
sunita williams, nine months, space, earth
  • whatsapp icon

అంతరిక్షంలో తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ భూమి మీదకు చేరుకున్నారు. సురక్షితంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు నేల మీద కాలు మోపారు. ఎంత ఉత్కంఠత. ఎంతటి నిరీక్షణ. ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిది నెలలు ఇద్దరూ అంతరిక్షంలోనే ఉంటూ కాలం గడిపేశారు. తెల్లవారుజామున 3.27 గంటలకు సునీతా విలియమ్స్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా భూమి మీదకు చేర్చింది. కేవలం వారం రోజుల పాటు యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్ బృందం అంతరిక్షంలో చిక్కుకుపోయింది.

స్సేస్ ఎక్స్ క్రూ 10 మిషన్...
అంతరిక్షంలో తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లో ఉంటున్న సునీత విలియమ్స్ ,బారీవిల్ మోర్ భూమి మీదకు సురక్షితంగా చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. . నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్ తో అనుసంధానం కావడంతో వారు భూమి మీదకు చేరుకున్నారు. మార్చి 15వ తేదీ ఉదయం 4:35 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి వెళ్లింది. రాకెట్ లో నలుగురు వ్యోమగాముల - అన్నే మెక్‌క్లెయిన్ ,నికోల్ అయర్స్, టకుయా ఒనిషి , రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. మార్చి 19 న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరింది.
గత ఏడాది వెళ్లి...
2024 జూన్‎లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్‎లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‎లో వీరి పర్యటన వారం రోజులు పర్యటన మాత్రమే. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో సాంకేతిక సమస్య తలెత్తడంతో. దీంతో నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ తిరిగి భూమి పైకి రాగా.. సునీత, బచ్‌ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో సునీతా విలియమ్స్ తో పాటు బచ్ విల్మోర్ అంతరిక్షంలోనే ఉండిపోయారు. . చివరరకు స్పేసే ఎక్స్ క్రూ మిషన్ 10 విజయవంతంగా అనుసంధానం కావడంతో వారి రాకసులువుగా మారింది.భూమి మీదకు చేరిన వెంటనే సునీత విలియమ్స్ తో పాటు విల్ మోర్ లను వైద్యుల పర్యవేక్షణలోకి తీసుకెళ్లిపోయారు.


Tags:    

Similar News