గర్భందాల్చిన అమ్మ, అమ్మమ్మ, అత్త
ఫొటోగ్రాఫర్ అయిన జిబిన్ భార్య చింజు ఇటీవలే గర్భం దాల్చింది. ఆయన విన్నూత్నంగా ఆలోచించారు.
సోషల్ మీడియాలో లైకుల కోసం ఇప్పుడు అనేకమంది అనేకరకాలుగా అవస్థలు పడుతున్నారు. విన్నూత్న ఆలోచనలతో చేసిన వీడియోలు, తీసిన ఫొటోలు వైరల్ గా మారడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే విన్నూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లడం మామూలయిపోయింది. ఈ నేపథ్యంలో ఫొటోగ్రాఫర్ అయిన జిబిన్ భార్య చింజు ఇటీవలే గర్భం దాల్చింది.
కొత్తరకం ఆలోచనతో...
దీంతో జిబిన్ కొత్తరకంగా ఆలోచించారు. స్వయంగా ఫొటోగ్రాఫర్ అయిన జిబిన్ తన ఇంట్లో మహిళలను ఒప్పించారు. ఇంట్లో ఉన్న మహిళలకు చెప్పి వారితో డ్రామా ఆడించారు. తన భార్య నిజంగా గర్భవతి అయినా, ఆమె అమ్మమ్మ, అత్తమ్మలు మాత్రం తమకు గర్భం దాల్చినట్లు నటించారు. దీంతో ఒకేసారి అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ ప్రెగ్నెన్సీ అయినట్లు కనిపించిన వీడియో వైరల్ గా మారింది. కానీ ఇది అబద్దం మాత్రేమే. ఫొటో షూట్ లో వారు అలా నటించారంతే.