America : అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు

నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ బరిలో ఉన్నారు.

Update: 2024-11-05 02:33 GMT

నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నవంబరులో వచ్చే తొలి మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో మొత్తం 25 కోట్ల మంది ఓటర్లుండగా, ఇప్పటికే ముందుగా దాదాపు ఆరున్నర కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. డెమోక్రాట్ల తరుపున కమలా హారిస్ ఉన్నారు.

ఇద్దరి మధ్య పోటా పోటీ...
ఇద్దరు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇద్దరి మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉందని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఈరోజు ఇద్దరిలో ఎవరు అమెరికా అధ్యక్షులవుతారన్నది అమెరికన్ ఓటర్లు తేల్చనున్నారు. మెయిల్స్ ద్వారా, పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరీ ఓట్లు వేస్తున్నారు. పోటీ రసవత్తరంగా మారడంతో యావత్ అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.


Tags:    

Similar News