బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఐబీపీఎస్
నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 8000 పైగా ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల కోసం నిర్వహిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్ న్యూస్ చెప్పింది. ఐబీపీఎస్ రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 8000 పైగా ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల కోసం నిర్వహిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 07 జూన్ 2022 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 27 జూన్ 2022గా గుర్తించారు. దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ - 27 జూన్ 2022గా తెలిపారు. ప్రీ-ఎగ్జామ్ ను ఆగస్టు 2022లో నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్ష తేదీ - సెప్టెంబర్/అక్టోబర్ లో ఉండవచ్చు. IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ 4483 పోస్టులు ఖాళీగా ఉండగా.. IBPS RRB ఆఫీసర్ స్కేల్ I – 2676 పోస్టులు, IBPS RRB ఆఫీసర్ స్కేల్ II – 842 పోస్ట్‌లు, IBPS RRB ఆఫీసర్ స్కేల్ III – 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి వయస్సు 21 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ వయస్సు పరిమితి 18-28 సంవత్సరాలు ఉండాలి. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌ను, ఐబీపీఎస్ వెబ్ సైట్ ను చూడవచ్చు.