How To Apply ISRO student project Trainee: ఇంటర్న్‌షిప్, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్‌లను తీసుకొచ్చిన ఇస్రో
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇటీవల ఇంటర్న్‌షిప్ స్కీమ్, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్‌లను తీసుకుని వచ్చింది
How To Apply ISRO student project Trainee:ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇటీవల ఇంటర్న్‌షిప్ స్కీమ్, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్‌లను తీసుకుని వచ్చింది. స్పేస్ సైన్స్, సాంకేతిక రంగంలో ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ స్కీమ్ లను ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో ఆసక్తిని కొనసాగించడానికి, ఆచరణాత్మక అనుభవాన్ని పొందాలనుకునే భారతదేశానికి చెందిన విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు.
ఎవరు అప్లై చేసుకోవచ్చు:
ఈ ఇంటర్న్‌షిప్ పథకం కింద.. భారతదేశం, విదేశాలలో సైన్స్/టెక్నాలజీలో అభ్యసిస్తున్న గుర్తింపు పొందిన సంస్థల నుండి అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), PhD విద్యార్థులు అర్హులు. ఇంటర్న్‌షిప్ వ్యవధి గరిష్టంగా 45 రోజులు ఉంటుంది. విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలో సరికొత్త అనుభవాన్ని పొందేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.
అర్హత:
విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 60% మొత్తం స్కోర్ లేదా 10కి 6.32 CGPA కలిగి ఉండాలి. ఈ ప్రోగ్రామ్ కోసం నిబద్ధత ఉన్న విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు.
ఇస్రో విద్యార్థులకు స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్‌ను పరిచయం చేసింది. 6వ సెమిస్టర్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు, 1వ సెమిస్టర్ తర్వాత ME/MTech విద్యార్థులు, చివరి సంవత్సరం BSc/Diploma విద్యార్థులు, 1వ సెమిస్టర్ తర్వాత MSc విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. కోర్సు పూర్తి చేసిన పీహెచ్‌డీ స్కాలర్‌లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు.
ప్రాజెక్ట్ వ్యవధి కనీసం 45 రోజుల నుండి 30 నెలల వరకు ఉంటుంది. ఆయా విద్యార్థుల డిగ్రీని బట్టి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (DoS)/ISROలో అకడమిక్ ప్రాజెక్ట్ వర్క్‌ను చేపట్టాలనుకునే విద్యార్థులు.. తప్పనిసరిగా 60% లేదా 10 స్కేల్‌లో 6.32 CGPAని కలిగి ఉండాలి. రెండు పథకాలకు ఎంపిక ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుంది. దరఖాస్తులతో సూచించిన నిబంధనల ప్రకారం సంబంధిత కేంద్రాలు/యూనిట్‌ల దగ్గర పరిశీలిస్తారు.
ఇంటర్న్‌లు, ప్రాజెక్ట్ ట్రైనీలకు ఎటువంటి చెల్లింపు లేదా ఆర్థిక సహాయం అందించరు. నిర్దిష్ట రంగాలలో ప్రసిద్ధ నిపుణులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అమూల్యమైన అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ లేదా ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఇస్రో ప్రయత్నాలకు వారి సహకారాన్ని గుర్తించే సర్టిఫికేట్ అందజేస్తారు.
అప్లై చేసుకోడానికి లింక్: