ఇస్రోలో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ సంస్థ టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా NRSC మొత్తం 54 ఖాళీలను భర్తీ చేస్తుంది. అందులో టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) 33 పోస్టులు, టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) 8 పోస్టులు, టెక్నీషియన్-బి(ఇన్‌స్ట్రూమెంట్ మెకానిక్) 9 పోస్టులు, టెక్నీషియన్-బి(ఫొటోగ్రఫీ)-2 పోస్టులు, టెక్నీషియన్-బి(డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్)-2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య ఉంటుంది. అలవెన్సులు అదనంగా లభిస్తాయి.