జాబ్స్: ఐఐటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం
ఐఐటీ హైదరాబాద్ లో వివిధ విభాగాల్లో ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త. ఐఐటీ హైదరాబాద్ లో వివిధ విభాగాల్లో ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అర్హత పొందాలంటే సంస్థ తెలిపిన అభ్యర్థుల వయస్సు, అర్హత ప్రమాణాలు ఉండాలి.
కింది విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి:
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్
బయోమెడికల్ ఇంజనీరింగ్
బయోటెక్నాలజీ
కెమికల్ ఇంజనీరింగ్
రసాయన శాస్త్రం
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
డిజైన్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
వ్యవస్థాపకత, నిర్వహణ (Entrepreneurship and Management)
లిబరల్ ఆర్ట్స్
గణితం
మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్
మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్
ఫిజిక్స్
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ I ఉద్యోగానికి సంబంధించి.. అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం మూడేళ్ల పోస్ట్-పీహెచ్‌డీ బోధన/పరిశోధన/వృత్తి అనుభవం కలిగి ఉండాలి. అదనంగా దరఖాస్తుదారులు రీసెర్చ్ జర్నల్స్ లో పేరు, పేటెంట్ల పరిశోధన లాంటి సామర్థ్యాలను కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ II కోసం, దరఖాస్తుదారులు 3 సంవత్సరాల కంటే తక్కువ పోస్ట్ PhD పారిశ్రామిక/పరిశోధన/బోధన అనుభవం కలిగి ఉండవచ్చు. వారి వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. SC/ST అభ్యర్థుల విషయంలో ఐదు సంవత్సరాల సడలింపు OBC-NCL అభ్యర్థుల విషయంలో మూడు సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. PWD SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాల సడలింపు.. OBC-NCL అభ్యర్థులకు 13 సంవత్సరాల సడలింపు ఉంటుంది.