OPSC Recruitment 2024: అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసుకోండి
అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ
ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 12గా నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.opsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.
OPSC రిక్రూట్‌మెంట్ 2024 ఖాళీల వివరాలు: 621 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వీటిలో 580 ఖాళీలు అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), 41 ఖాళీలు అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టులకు ఉన్నాయి. అభ్యర్థుల వయోపరిమితి జనవరి 1, 2021 నాటికి 21 నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. OPSC రిక్రూట్‌మెంట్ 2024 విద్యార్హతను గమనిస్తే.. AEE (సివిల్) పోస్ట్ కోసం అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. AEE (మెకానికల్) పోస్ట్ కోసం అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. OPSC రిక్రూట్‌మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ విధానం.. అభ్యర్థుల ఎంపిక గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే:
opsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
హోమ్‌పేజీలో, “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయి”పై క్లిక్ చేయండి
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫారమ్‌ను సమర్పించండి
ప్రింటవుట్ తీసుకోండి