SAIL Recruitment 2023: సెయిల్ లో ఉద్యోగాలు
SAIL Recruitment 2023: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 92 మేనేజ్‌మెంట్
SAIL Recruitment 2023: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 92 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ స్థానాలకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 11న అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2023 గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ - sail.co.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, అర్హత, దరఖాస్తు ప్రక్రియ, జీతం, విద్యార్హతలు వంటి వివరాలను sail.co.in లో తనిఖీ చేయవచ్చు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం
అప్లికేషన్స్ ను డిసెంబర్ 11, 2023న మొదలుపెట్టారు. అప్లికేషన్ ముగింపు తేదీ డిసెంబర్ 31, 2023గా నిర్ణయించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తును పూరించాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు లింక్ యాక్టివేట్ చేశారు. అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు సూచనలను జాగ్రత్తగా చదవాలి. అవసరమైన గ్రూప్ కు చెందిన వారు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
కెమికల్ ఇంజనీరింగ్ లో 3 ఉద్యోగాలు.. సివిల్ ఇంజనీరింగ్ లో.. 3, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 26 ఉద్యోగాలు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో 7, మెకానికల్ ఇంజనీరింగ్ లో 34 ఉద్యోగాలు.. మెటలర్జీ ఇంజనీరింగ్ లో 5 ఉద్యోగాలు.. మైనింగ్ ఇంజనీరింగ్ లో 14 ఉద్యోగాలు ఉన్నాయి. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో అభ్యర్థి 65% మార్కులతో ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లకు 33 సంవత్సరాలు, ఓబీసీలకు 31 సంవత్సరాలుగా ఏజ్ లిమిట్ ను ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు బేసిక్ పేలో రూ. 50000–180000 వరకు ఉంటుంది. ఒక సంవత్సరం పాటు అభ్యర్థులకు శిక్షణపై ఇచ్చాక.. అభ్యర్థులను అసిస్టెంట్ మేనేజర్‌లుగా నియమించనున్నారు. అప్లికేషన్ ఫీజు ఓబీసీ క్యాండిడేట్లకు 700 రూపాయలు.. SC/ST/PWBD/ESM/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 200 రూపాయలుగా నిర్ణయించారు.