పోలీసు ఉద్యోగాలకు ఊహించని డిమాండ్.. ఎంత మంది అప్ప్లై చేసుకున్నారంటే
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా పోలీసు శాఖలోని ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ పోస్టులతో పాటు రవాణా, ఎక్సైజ్, ఫైర్, జైళ్ళ శాఖలలోని ఖాళీల భర్తీకి
నిరుద్యోగ యువత ఎన్నో రోజులుగా ఎదురుచూసిన నోటిఫికేషన్స్ రానే వచ్చేసాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా పోలీసు శాఖలోని ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ పోస్టులతో పాటు రవాణా, ఎక్సైజ్, ఫైర్, జైళ్ళ శాఖలలోని ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 17 వేల పైచిలుకు పోస్టుల కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ దరఖాస్తులను ఆహ్వానించగా, మంగళవారం నాటికి దాదాపు ఏడున్నర లక్షల దరఖాస్తులు అప్‌లోడ్ అయినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలోని ఉద్యోగాల కోసమే దాదాపు నాలుగున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 2018 లో రాష్ట్ర పోలీసు శాఖ 16 వేల పై చిలుకు ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా దాదాపు ఏడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి గతంలో వచ్చిన దరఖాస్తుల కంటే ఎక్కున దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.