బ్రేకింగ్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు
తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు
తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. తిరిగి కొత్త నోటిఫికేషన్ తో పరీక్ష నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.
జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం పరీక్ష జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారనే విషయాన్ని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన హైకోర్టు గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.