Samantha : సమంత ఇలా పోస్టు చేశారేంటి? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?
సినీ నటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.అయితే తాజాగా పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది
సినీ నటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.అయితే తాజాగా పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినీ నటి సమంత వచ్చే ఏడాది తన రాసి ఫలానికి సంబంధించిన పోస్టును షేర్ చస్తూ అందులో చెప్పిన విధంగా జరగాలనిభావిస్తున్నట్లు షేర్ చేశారు. వృషభ, మకర, కన్య రాశి వారికి 2025 ఏడాదిలో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉందని ఎవరో చేసిన పోస్టును సమంత షేర్ చేశారు.
పోస్టులో ఏముందంటే.
ఈ ఏడాదంతా బిజీగా ఉంటారని, ఆర్థికంగా బలపడతారని, వృత్తిపరంగా మెరుగుపడతారని, నమ్మకం, ప్రమేను అందించే భాగస్వామిని పొందుతారని, ఆదాయ మార్గాలను పెంచుకుంటారని, మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారని, మానసికంగా, స్ట్రాంగ్ గా ఉటారని చేసిన పోస్టును సమంత షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్త ఏడాది సమంత నమ్మకమైన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారా? అన్నట్లు కొందరు పోస్టు చేస్తుండగా, మరికొందరు మాత్రం సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఇంకొందరు పోస్టులుపెడుతున్నారు.