పుష్ప2' టికెట్లపై ఆర్జీవీ లేటెస్ట్ ట్వీట్
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2' టికెట్ ధరల పెంపుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప2' టికెట్ ధరల పెంపుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే పుష్ప టిక్కెట్ల ధరల పెంపును స్వాగతిస్తూనే ఈ ట్వీట్ చేశారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఎక్స్ లో మళ్లీ...
రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఎక్స్ లో యాక్టివ్ అయ్యారు. హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత ఆయన తిరిగి తన పూర్వ స్థితికి వచ్చినట్లే కనపడుతుంది. సినిమాలపైన తిరిగి ఆయన తన ట్వీట్లను ప్రారంభించినట్లే కనిపిస్తుంది. వర్మపై ఇటీవల కాలంలో ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.