Breaking : అల్లు అర్జున్ పోలీసులపై అసహనం.. బెడ్ రూంలోకి వస్తారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.సంథ్య థియేటర్ లో మహిళ మరణించిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2024-12-13 07:54 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.సంథ్య థియేటర్ లో మహిళ మరణించిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 108, 115, 105, 118 రెడ్ విత్ BNS 118 (1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదయినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఇందులో 105 నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో కొంత ఆందోళన అల్లు అర్జున్ కుటుంబంలో వ్యక్తమవుతుంది. పోలీస వాహనంలో అల్లు అర్జున్ ను పోలీసులకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఆయనను ప్రశ్నించిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం న్యాయస్థానానికి తరలించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే న్యాయనిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఈ సెక్షన్ బట్టి చూస్తే ఏడాది నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముందని కూడా చెబుతున్నారు.

అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో...
ఎలాంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ కు పుష్ప ప్రీమియర్ షోకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఒక బాలుడు చికిత్స పొందుతున్నారు. . ఈ ఘటనపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. కానీ న్యాయస్థానంలో అల్లు అర్జున్ కు బెయిల్ లభించే అవకావాలు కూడా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. తనకు తెలియకుండా జరిగిన ఘటన కావడంతో పాటు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే సమయంలో ఆయన పోలీసులపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసులు తనను తీసుకెళ్లడంలో అభ్యంతరం లేదని, అయితే నేరుగా బెడ్ రూంలోకి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ తనపై నమోదయిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అల్లు అర్జున్ కు ఆసుపత్రిలో వైద్య పరీక్షలునిర్వహించిన తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది. అల్లు అర్జున్ ను ప్రస్తుతం ఉస్మానియ ఆసుపత్రి కి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.


Tags:    

Similar News