Big Boss : నేడు బిగ్ బాస్ సీజన్ ముగింపు.. ఎవరు విన్నరంటే?

బిగ్ బాస్ సీజన్ 8 నేడు ముగియనుంది. నేడు ఫైనల్ రోజు కావడంతో ఈ రియాల్టీ షో నేటితో తెరపడనుంది

Update: 2024-12-15 02:07 GMT

బిగ్ బాస్ సీజన్ 8 నేడు ముగియనుంది. నేడు ఫైనల్ రోజు కావడంతో ఈ రియాల్టీ షో నేటితో తెరపడనుంది. బిగ్ బాస్ 8 సీజన్ 8 సెప్టంబరు 1వ తేదీన ప్రారంభమై నేటితో ముగియనుంది. అనేక మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ప్రారంభంలో వచ్చిన వారితో పాటు ఐదు వారాల షో ప్రారంభమయిన అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా కొందరు ఇచ్చారు. చివరకు బిగ్ బాస్ షో లో ఫైనలిస్టులుగా నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ లు పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురిలో నేడు ఒకరు విజేతగా నిర్ణయిస్తారు.

గ్రాండ్ ఫినాలేకి...
గ్రాండ్ ఫినాలే కావడతో పెద్దయెత్తున అభిమానులు చేరుకునే అవకాశముందని భావించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ షో ముగిసన వెంటనే కంటెస్టెంట్లతో భారీ ర్యాలీని కూడా నిర్వహించనున్నారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరు విజేత అయినా మిగిలిన కంటెస్టెంట్ల అభిమానులు ఆందోళనకు దిగే అవకాశముందని భావించిన నిర్వాహకులు గ్రాండ్ ఫినాలేకి భారీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈరోజు జరిగే గ్రాండ్ ఫినాలాలో గౌతమ్, నిఖిల్ ల మధ్య ట్రోఫీ దోచూచులాడుతుందని తెలిసింది.


Tags:    

Similar News