బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్. సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన డాకూ మహరాజ్ త్వరలో ఓటీటీలోకి రానుంది;

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్. సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన డాకూ మహరాజ్ త్వరలో ఓటీటీలోకి రానుంది. నందమూరి బాలకృష్ణ నటించి, బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి పండగకు విడుదలై అభిమానులను మాత్రమే కాకుండా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేసింది.
నెట్ ఫ్లిక్స్ తో పాటు...
నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. అయితే డాకూ మహారాజ్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగాఎదురు చూస్తున్నారు. డాకూ మహారాజ్ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. ఈనెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో బాలయ్య నటించిన డాకూమహారాజ్ ను చూడవచ్చని తెలిపింది.