కేరళలో సినీ ఇండస్ట్రీ సమ్మె
కేరళలో సినీ పరిశ్రమ బంద్కు పిలుపు నిచ్చింది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ఈ మేరకు బంద్ చేయాలని నిర్ణయించింది;

కేరళలో సినీ పరిశ్రమ బంద్కు పిలుపు నిచ్చింది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ఈ మేరకు బంద్ చేయాలని నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి మాలీవుడ్ లో సమ్మె చేయాలని నిశ్చయించారు. కేరళలోని అన్ని సినిమా షూటింగులు బంద్ చేయడమే కాకుండా థియేటర్ల ప్రదర్శనలు నిలిపివేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ నిర్ణయించింది.
మాలీవుడ్ లో సమ్మె సైరన్...
ఈ సమ్మె నిరవధికంగా కొనసాగనుందని తెలిపింది. పెరిగిన బడ్జెట్లు.. తగ్గిన సక్సెస్ శాతంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళసమ్మెకు సిద్ధమవుతుంది. నటీనటులతో పాటు టెక్నీషియన్లు కూడా పారితోషికం పెంచడంతో నిర్మాతల మీద భారం పెరుగుతుందని అభిప్రాయపడింది. వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికే ఈ సమ్మె అని తెలిపింది. మిగిలిన ఇండస్డ్రీల మీద ఈ సమ్మె ప్రభావం పడనుంది. దీంతో జూన్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాల మలయాళ వెర్షన్ల పరిస్థితి గందరగోళంలో పడింది.