Balakrishna : తమన్ కు విలువైన బహుమతి ఇచ్చిన బాలయ్య
మ్యూజిక్ దర్శకుడు తమన్ కు నందమూరి బాలకృష్ణ విలువైన బహుమతిని అందించారు.;

మ్యూజిక్ దర్శకుడు తమన్ కు నందమూరి బాలకృష్ణ విలువైన బహుమతిని అందించారు. తన సినిమాలకు మంచి సంగీతాన్ని అందించిన తమన్ కు గిఫ్ట్ ను బాలకృష్ణ అందించి తన ప్రేమను తమన్ పై చాటుకున్నారు. తనకు వరసగా నాలుగు సినిమాల్లో మంచి సంగీతం అందించిన తమన్ ను తన కుటుంబంలో ఒక సభ్యుడిగా బాలయ్య చెప్పారు.
వరస హిట్లు ఇచ్చి...
తమన్ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. తమన్ తనకు సోదరుడు లాంటివాడని, వరసగా హిట్లు ఇచ్చిన తమన్ కు ప్రేమతో ఈ కారును బహుకరించినట్లు బాలయ్య తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తమ బంధం మరింత కాలం కొనసాగుతుందని బాలకృష్ణ ఆకాంక్షించారు.