Chiranjeevi : పాలిటిక్స్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తాను రాజకీయాల్లో తిరిగి ఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు.;

మెగాస్టార్ చిరంజీవి తాను రాజకీయాల్లో తిరిగి ఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. తనకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని ఆయన ప్రకటించారు. తన రాజకీయాల రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన తన అభిమానులను సూచించారు.
రాజకీయాలకు దూరంగా ఉంటానని...
తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, తాను పూర్తి చేయలేనిది తన స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మధ్య తాను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యానని, ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారని, కానీ అలాంటిది ఏమీ లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు.