SSMB 29 : రాజమౌళి, మహేష్ బాబు మూవీ కీలక అప్ డేట్ ఇదే
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది.;

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. మహేష్ ఫ్యాన్స్ కు ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటికే SSMB 29 గా బాగా ప్రాచుర్యం పొందిన ఈ చిత్రంలో కీలక అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా హీరో గా మహేష్ బాబుతో ఢీకొనెదవరు అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తుంది.
పృథ్వీరాజ్ కుమారన్ ట్వీట్ తో...
ఈ సినిమాలో విలన్ మలయాళ దర్శకుడు పృథ్వీరాజ్ కుమారన్ పేరు గత కొంతకాలంగా వినిపిస్తుంది. కానీ దీనిపై ఎవరూ ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ కుమారన్ చేసిన ట్వీట్ తో మహేహ్ బాబు సినిమాలో విలన్ గా తానే నటిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ఆయన ఎక్స్ లో తన సినిమాలన్నీ పూర్తి చేసుకున్నానని, ఇతర భాషా చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని, భారీ డైలాగులుండటంతో కొంత భయమేస్తుందని పోస్ట్ చేశారు. తాను నటుడిగా కనపడుతున్నానన చెప్పడంతో ఇది మహేష్ బాబు, రాజమౌళి సినిమా అయి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.