మెగా హీరోలేమైనా మంచి చేస్తారా

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలు మరే ఫ్యామిలిలో లేరు. ఆ ఫ్యామిలిలో ఓ హీరోతో నటించిన హీరోయిన్ కి మరిన్ని అవకాశాలొస్తాయంటారు. అలాగే [more]

;

Update: 2019-10-12 08:05 GMT
తమన్నా
  • whatsapp icon

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలు మరే ఫ్యామిలిలో లేరు. ఆ ఫ్యామిలిలో ఓ హీరోతో నటించిన హీరోయిన్ కి మరిన్ని అవకాశాలొస్తాయంటారు. అలాగే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేని తమన్నా కి చరణ్ పక్కన రచ్చ సినిమా అవకాశం వస్తే అల్లు అర్జున్ పక్కన బద్రీనాధ్ అవకాశం వచ్చింది. తాజాగా చిరు సినిమా సైరా లోనూ తమన్నా మంచి అవకాశం పట్టింది. ఇక మెయిన్ హీరోయిన్ నయనతార సైరా ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇస్తే తమన్నా మాత్రం సైరాని విడుదలయ్యాక కూడా వదలకుండా ప్రమోట్ చేస్తుంది.

తమన్నాతో రాంచరణ్ ఫిదా..

తమన్నా ప్రమోషన్స్ కి ఫిదా అయిన చరణ్ ఓ డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేశాడు. ప్రస్తుతం ఫేమ్ కోల్పోతున్న తరుణంలో సైరా నరసింహారెడ్డి సినిమా తమన్నాని ఆదుకుందనే చెప్పాలి. సైరా తర్వాత మంచి మంచి అవకాశాలు తమన్నా తలుపు తడుతున్నాయి. ఇక మెగా హీరోల సినిమాల్లో కూడా తమన్నా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అది హీరోయిన్ అయినా… ఐటెం సాంగ్స్ అయినా. మరి మెగా హీరోలు మెల్లిగా తమన్నాకి అవకాశాలిస్తే.. ఆమె కెరీర్ కొన్నాళ్ళు స్టడీ అయినట్లే.

 

Tags:    

Similar News