Prabhas : డార్లింగ్ ప్రభాస్ అస్సలు వాటి వైపే చూడరట.. ఆశ్చర్యమే కదూ?
రెబల్ స్టార్ ప్రభాస్ లో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయని టాలీవుడ్ ఇండ్రస్ట్రీలో ఎవరిని కదిలించినా చెబుతారు.;
![Prabhas : డార్లింగ్ ప్రభాస్ అస్సలు వాటి వైపే చూడరట.. ఆశ్చర్యమే కదూ? prabhas, rebel star, pridhviraj sukumaran, tollywood](https://www.telugupost.com/h-upload/2025/01/29/1500x900_1685481-prabhas-1.webp)
రెబల్ స్టార్ ప్రభాస్ లో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయని టాలీవుడ్ ఇండ్రస్ట్రీలో ఎవరిని కదిలించినా చెబుతారు. ఆయనకు ఉన్న స్టార్ డమ్ కు ఒక హీరోలా కాకుండా సాదాసీదాగా సెట్ లో ఉంటారని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతారు. ఇక సెట్ లో లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకూ ప్రభాస్ ఇచ్చే గౌరవం ఒకేలా ఉంటుంది. ఇక ప్రభాస్ తో షూటింగ్ ఉంటే ఇక అందరికీ పండగే. సినిమా నిర్మాణంలో పనిచేసే వారందరికీ ఇంటి నుంచే భోజనాలు తెప్పించడం ప్రభాస్ కు అలవాటు. అందులోనూ అన్ని రకాల భీమవరం వంటలను రుచిచూపిస్తూ, అందరికీ భోజనం పెట్టి ప్రభాస్ తీసుకునే కేర్ ను కూడా ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు.
సోషల్ మీడియాకు దూరం...
బాలీవుడ్ హీరోగా మారినప్పటికీ ప్రభాస్ లో ఎలాంటి మార్పు రాలేదంటారు. ఏమాత్రం ఇగోలేని హీరోగా ప్రభాస్ ను ఇండ్రస్ట్రీలో ప్రతి ఒక్కరూ అంటుంటారు. అలాంటి ప్రభాస్ గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తుంటాయి. డార్లింగ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఈ న్యూస్ ను చెప్పేందుకు ఎవరూ వెనకాడరు కూడా. ప్రభాస్ కు చిత్ర పరిశ్రమలో అందరితోనూ కలివిడిగా ఉండటంతో పాటు అజాతశత్రువుగానే భావిస్తారట. అలాంటి ప్రభాస్ ను బాగా తెలిసిన వారు చెబితే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు .. అంటే టాలీవుడ్ నటులు చెబితే పెద్దగా మనకు మైండ్ కు ఎక్కదు. ఎందుకంటే సినిమాల్లో వేషాల కోసం అలా మాట్లాడుతుంటారులే అని అనుకునేవారు కూడా ఉంటారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ఏమన్నారంటే?
కానీ తాజాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రభాస్ ను విపరీతంగా పొగిడేశారు. ముందుగా రాజమౌళి - మహేష్ బాబు చిత్రంలో నటించడంపై ఆయన క్లారిటీ ఇస్తూ ఇంకా ఖరారు కాలేదని, చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. సలార్ 2లో ప్రభాస్ లో తాను నటించబోతున్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. సలార్ 2 సినిమాలో కూడా తాము చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. అసలు విషయం ఏంటంటే ప్రభాస్ సోషల్ మీడియాను అస్సలు ఉపయోగించరట. అంటే ప్రభాస్ సెల్ ఫోన్ కేవలం మాట్లాడేందుకే ఉపయోగిస్తారట. ఏవైనా విషయాలు ఉంటే తన సన్నిహితుల వద్ద మాత్రమే పంచుకుంటారని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ప్రభాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని కూడా చెప్పారు.