ఆసుపత్రిలో 30 ఇయర్స్ పృథ్వీ
టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అస్వస్థతకు;

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. విష్వక్ సేన్ తాజా చిత్రం 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో 'బాయ్ కాట్ లైలా' అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దీంతో, విష్వక్ సేన్ వివరణ ఇవ్వడమే కాకుండా, క్షమాపణ చెప్పారు. ఈ సినిమాలో పృథ్వీ ఒక నటుడు మాత్రమేనని, ఆయన మాటలు పట్టించుకోవద్దని కోరారు. ఇంతలో పృథ్వీ ఆసుపత్రి పాలయ్యారు.
విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ తమ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు పృథ్వీ రాజ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలకు మేము వారితో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని విశ్వక్ అన్నారు. పృథ్వీ క్షమాపణలు చెప్పాలని, లేదంటే సినిమా నుంచి ఆయన సీన్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పృథ్వీ ఫోన్ నెంబర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని సమాచారం. ఫిబ్రవరి 14న లైలా సినిమా విడుదల కాబోతోంది.