పవన్ కు పొగడ్తలు...మహేష్ పై వర్మ విమర్శలు

Update: 2017-01-26 06:45 GMT

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సూపర్ స్టార్ మహేష్ బాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మహేష్ బాబును దేశద్రోహిగా వర్మ పేర్కొన్నారు. తమిళ వికృత క్రీడ అయిన జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేష్ బాబు ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుపుతున్న నిరసనకు ఎందుకు సపోర్ట్ చేయలేదని ప్రశ్నించారు. తన డబ్బింగ్ సినిమాలను తమిళనాడులో ప్రమోట్ చేసుకునేందుకే ప్రిన్స్ జల్లికట్టుకు మద్దతు తెలిపాడన్నారు వర్మ. తనను హీరోగా నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం మద్దతు తెలపకుండా.. పొరుగు రాష్ట్రాలు వారు చేసే నిరసనలకు మద్దతు తెలపడం ఏంటని ప్రశ్నించారు. అయితే వర్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మాత్రం తెగ పొగిడేశారు. హీరోలంతా సినిమాల్లో రాజకీయ నేతలు, పోలీసులతో పోరాడుతుంటే.. పవన్ నిజజీవితంలో ప్రజాసమస్యలు, రాజకీయ పార్టీలతో పోరాడుతున్నారని ట్వీట్ చేశారు.

అయితే మహేష్ బాబును దేశద్రోహిగా అనడం పట్ల వర్మపై ప్రిన్స్ అభిమానులు మండిపడుతున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబే కాదు ప్రత్యేక హోదా కోసం నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ తేజ, అల్లుఅర్జున్ వంటి వారు కూడా ఇంతవరకూ హోదాపై తమ అభిప్రాయాన్ని తెలియజేయలేదు కదా? అని మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వారందరినీ వదిలి వర్మ తమ హీరోను తప్పుపట్టడం సరికాదంటున్నారు.

Similar News