మళ్ళీ స్టోరీ దొరికిందంటున్న వర్మ!

Update: 2016-08-24 06:12 GMT

నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తీయడంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ముందుంటాడు. అసలు రౌడీ ఇజం చేసి ఫ్యాక్షనిస్టులు కథలని సినిమాలుగా తీయాలంటే ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. పరిటాల రవీంద్ర, సూరి ల జీవిత చరిత్రల ఆధారం గా ఆమధ్య రక్త చరిత్ర 1, ఇంకా పార్ట్ 2 లు తీసి సెన్షేషన్ క్రియేట్ చేఇస్నా వర్మ... ఇక ఇటీవలే వీరప్పన్‌ జీవితకథతో సినిమా తీసి అందరినీ మెప్పించిన వర్మకు ఇప్పుడు మరో కథ దొరికేసిందట. అది మరెవరదో కాదు... దోపిడీలు, భూదందాలు, అకృత్యాలతో అందరూ విస్తుపోయేలా చేసిన గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథ. అవును ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌పై సినిమా తీస్తానంటున్నాడు వర్మ. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నయీం గురించి ఎన్నో కథనాలు చదివి తెలుసుకున్నాను. అతను చేసిన కుట్రలు చాలా భయంకరమైనవి. నక్సలైట్‌ నుంచి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా మారి తర్వాత అండర్‌వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీం భయంకరమైన క్రిమినల్‌. నయీం గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు పెద్ద సినిమానే తీయాలి. త్వరలో నయీంపై సినిమా తీస్తాను. రక్తచరిత్ర సినిమాని రెండు భాగాల్లోనే చూపించాను. కానీ నయీం చరిత్రను మూడు భాగాల్లో తెరకెక్కిస్తాను అని అంటున్నాడు వర్మ. ఇక ఈ సినిమా తీస్తే వర్మ పేరు తెలుగు రాష్ట్రాలలోని కాదు ఇంకా నాలుగు ఐదు రాష్ట్రాలలో మార్మోగిపోతోంది.

Similar News